Monday 20 June 2016

అమ్మ

ఆది దేవత రా అమ్మ  ఆమె వలదంటే లేదు ఈజన్మా. అమ్మ వున్నా ఇంటిలో లేనిది ఏదీ .అమ్మ అన్నది ఒక కమ్మని మాట .అమ్మంటేనే ఒక భరోసా ఒక హాయీ .ఎన్ని ఉపమానాలూ సరిపోని ఒకే ఒక్క పదం అమ్మ .మాది సూర్యాపేట తాలుకాలోని నూతన్కల్ గ్రామం.అన్నయ్య ,అక్కయ్య,నేనూ ,తమ్ముడు.మా చిన్నప్పుడు దాదాపు 45 ఏళ్ల  క్రితం జ్ఞాపకాలు .నాన్న నాస్తిక భావాలు  కలవాడు .ఏది వద్దనే వాడు .అమ్మకేమో మాకు గాజులు గొలుసులు అన్ని వేయాలని తపించేది.నాన్నకు తెలియకుండా కొని పెళ్లిళ్లకు పేరంటాలకు మాకు వేసేది .మా పెళ్ళిళ్ళలో కూడా అమ్మ పడ్డ సంఘర్షణ మర్చిపోలేను .అప్పటి సామజిక పరిస్థితి,సంప్రదాయాలు ఆచారాలు ఒకవైపు -నాన్న సిదాంతం ఒకవైపు .ఈ రెంటి మధ్య నలిగినా అమ్మను నేను చాల గమనిన్చేదాన్ని .అందుకే అమ్మంటే ఒకింత ఎక్కువ ప్రేమ .నా న్న సహకారంతో  అమ్మ ఊర్లో సర్పంచగా పని చేసి మంచిపేరు తెచుకున్నది .వీధి దీపాలు పెట్టించింది .మహిళామండలి సెక్రెటరీగా బాల్వాడి సెంటర్,కుట్టుమిషన్ సెంటర్ పెట్టించింది .అప్పట్లోనే ఆరోగ్యవంతమైన పాపల పోటీ పెరటితోటల పోటి పళ్ళపొడి తయారు చేయడం నేర్పించింది .నా న్న  ఎక్కువగా  మాట్లాడేవాడు కాదు.అమ్మే అన్ని చూసుకునేది .మా భూములు అమ్మడం పెద్దమనుశులతో మాట్లాడటం డబ్బులు వసూలు చెయడం లాంటి లావాదేవిలన్ని చూసుకునేది .తాతయ్య అమ్మమ్మలు వ్రుధాప్యములో చేరోమంచంలో వుంటే అమ్మ ఎంత సేవ చేసిందో చూసాను .మా   బాధ్యతలన్నీ తీరాయి,అమ్మమ్మ,తాతయ్య పోయారు ,నాన్న రిటైరయ్యారు .ఇక ప్రశాంతంగా వున్దామనుకునేవేల నాన్నకు పెరలసిస్స్త్రోక్ .ఇక అప్పటినుండి దాదాపు 6 సంవత్సరాలు నాన్నని చిన్న పిల్లాడిలాగ తినిపించడం ,మూతితుడవడం ,స్నానం చేయించడం  ఇస్త్రి బట్టలతో పెల్లిల్లకు తీసుకెళ్ళడం వేల్లకు  మందులు వేయడం చేస్తూ ఆది దంపతుల్ల లాగ తిరిగేవారు .అమ్మను చూసి ఎన్నో నేర్చుకున్నాను .ఒక స్త్రీ అంటే ఇన్ని కోణాలు వుంటాయా ఉండాలా అని .ఇంత తెలివి ,సహనం,ఓర్పు ,శ్రమ,ప్రేమ ,వాత్సల్యం ఎన్నొ పార్శ్వాలు కనిపించాయి అమ్మలో .నానన 2000 సంవత్సరంలో పోయారు .పిల్లలం ముగ్గురం సిటీలోనే ఉన్నాము .మా దగ్గర వుండమంటే ఉండట్లేదు .నావంట ,నా పనులు అన్నీ నేను చేసుకుంటూ వున్నాగా ఇప్పుడే మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంటున్నది .నాకు చేతగానప్పుడు వస్తాను  అప్పుడు చూస్తాను అంటున్నది .83 సంవత్సరాల వయసులో ఆ మే పట్టుదల,స్వశక్తి మీద నమ్మకం సడలని సంకల్పం మాకు స్ఫూర్తి .అందరూ వుండి అమ్మనలా ఒంటరిగా వదిలమా అని మనసు కష్టంగా ఉంది .ఇది అంతే లేని మా అమ్మ కథ.అమ్మకు తన బాధను చెప్పుకొని ఓదార్పు పొందడానికి ఎవరూ లేరు .అన్నాతమ్ముల్లు ,అక్కాచెల్లెళ్లు లేరు .ఎన్నో సవాళ్ళను ఒంటరిగా ఎదుర్కొన్న ధీశాలి .నా జీవితంలో ఎదురైనా ప్రతి క్లిష్ట సమయంలో అమ్మైతే ఏమి చేసేది అని -అలాగే ధైర్యంతో ముందుకు సాగుతున్నాను .

1 comment:

  1. బ్లాగ్లోకానికి స్వాగతం ! శరత్ గారిద్వారా మీ అమ్మగారు పరిచయమయినారు.2013లో వారి ఇంటికి వెళ్ళాను.ఇపుడు గుర్తూన్నానో లేదో తెలియదు.ఎపుడు ఫోన్ చేసినా మాట్లాడేవారు.నేను నంబర్ పోగొట్టుకున్నాక చేయలేదు.నీహారిక గుర్తుందా అని అడగండి.ఒక్కరోజే చూసినా మీ అమ్మగారు నాకు నచ్చారు.తరచుగా వ్రాస్తూ ఉండండి.
    "సుమ సౌరభాలు" అని తెలుగులో వ్రాస్తే బాగుంటుంది కదా ?

    ReplyDelete